Allari Naresh: నరేశ్‌ లైనప్‌ రకరకాల కథలు.. చేసేదెవరు.. ఏమున్నాయ్‌?

Advertisement

ఇప్పుడు అంతా సీక్వెల్స్‌, సెకండ్‌ పార్టుల సందడి నడుస్తోంది. ఒక సినిమాను రెండు ముక్కలు చేసి విడుదల చేస్తున్నారు కూడా. ఇలాంటి సమయంలో గతంలో మంచి విజయాలు అందుకున్న సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘ఆ సినిమాకు సీక్వెల్‌ వస్తే అదిరిపోతుంది’ అనే మాట వినిపిస్తోంది. దీనికి చిన్న హీరోల సినిమాలు అతీతం ఏమీ కాదు. వాళ్ల సినిమాలు కూడా సీక్వెల్‌ రూపంలో వస్తే చూడాలని కోరుకుంటుంటారు. అలా అల్లరి నరేశ్‌ సినిమాలు కూడా కొన్ని ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

అల్లరి నరేశ్‌ కెరీర్లో అదిరిపోయే సినిమా, అతనిని సడన్‌ స్టార్‌ను చేసిన సినిమా ‘సుడిగాడు’. ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని గతంలో వార్తలొచ్చాయి కూడా. ఈ మాట ఆయన దగ్గర ప్రస్తావిస్తే.. ‘సుడిగాడు’ సినిమాకు రెండో భాగం చేయొచ్చు అన్నారు. అంతేకాదు వాళ్ల నాన్న చివరి రోజుల్లో ‘అలీబాబా అరడజను దొంగలు’కి సీక్వెల్‌ సినిమా ఆలోచనలు కూడా చేశారు అని చెప్పారు. ‘అలీబాబా డజన్‌ దొంగలు’ అనే ఆలోచనను ఈవీవీ చేసేవారని అల్లరి నరేశ్‌ చెప్పారు.

దీంతో ఈ సినిమా సీక్వెల్స్‌ ఆలోచన (Allari Naresh) అల్లరి నరేశ్‌ మైండ్‌లో ఉంది అని అర్థమవుతోంది. మరి ఎప్పుడు చేస్తారు అనేదే ప్రశ్న. ఇక నరేశ్‌ లైనప్‌ చూస్తే.., ఫరియా అబ్దుల్లాతో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో మరో సినిమా చేస్తారట. అలాగే ‘జెండా’ అనే కథను ఇటీవల కొనుగోలు చేశానని నరేశ్ చెప్పారు. ఆ సినిమానే నరేశే నిర్మిస్తారట. అయితే అందులో నటించేది ఆయనా? లేక వేరేవాళ్లా అనేది తెలియాలి.

విజయ్‌ కనకమేడలతో హ్యాట్రిక్‌గా మూడో సినిమా చేయడానికి ఆలోచనలు ఉన్నాయట. ‘నాంది’ సినిమాతో ఇద్దరూ తొలిసారి నటించారు. ఇప్పుడు ‘ఉగ్రం’ వస్తోంది. దీని తర్వాత మూడో సినిమా కూడా ఉంటుంది అంటున్నారు. అది కూడా పై రెండు సినిమాల్లాగే ప్రయోగాత్మకంగానే ఉంటుందని సమాచారం. ‘ఉగ్రం’ వచ్చాక దాని పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus