Hero Ram: రామ్ కోరుకున్న బ్లాక్ బస్టర్ డబుల్ ఇస్మార్ట్ తో దక్కుతుందా?

  • September 30, 2023 / 05:06 PM IST

రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత భారీ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంతగానో కష్టపడుతుండగా స్కంద సినిమా ఆ ఆశలను నెరవేర్చే అవకాశం కనిపించడం లేదు. పక్కా మాస్ మసాలా సినిమా కావడంతో క్లాస్ ప్రేక్షకుల్లో ఈ సినిమాకు ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రావడం లేదు. టార్గెట్ భారీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది. రామ్ కోరుకున్న బ్లాక్ బస్టర్ డబుల్ ఇస్మార్ట్ తో దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

హీరో రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ సాధించడం పూరీ జగన్నాథ్ కు కూడా కీలకమనే సంగతి తెలిసిందే. లైగర్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ కోసం ఎంతగానో కష్టపడుతున్నారు. వచ్చే ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

రామ్ పూరీ జగన్నాథ్ కాంబో మూవీ మరోమారు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. రామ్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. రామ్ సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. రామ్ సినిమాలకు ఓటీటీలో సైతం మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

రామ్ (Hero Ram) డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ మూవీ 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. రామ్ కొత్త ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలను సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus