టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. లైగర్ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ధర్నాకు దిగడం హాట్ టాపిక్ అయింది. పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాలకు ఇబ్బందులు కలగజేస్తామని వాళ్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందనే సంగతి తెలిసిందే.
పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వడానికి హీరోలు, నిర్మాతలు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. రామ్ పూరీ కాంబో మూవీ వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.
(Ram) రామ్ బోయపాటి కాంబో మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సరైన సక్సెస్ దక్కలేదనే సంగతి తెలిసిందే. రామ్ సినిమాలన్నీ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయి. రామ్ రెమ్యునరేషన్ 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ కథ, కథనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పూరీ జగన్నాథ్ మళ్లీ 40 కోట్ల రూపాయలతో సినిమాను నిర్మిస్తుండటంతో అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూరీ జగన్నాథ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పూరీని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. పూరీ జగన్నాథ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తే ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. పూరీ రామ్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!