హీరో సుధీర్ బాబు ఫ్యామిలీ ఫోటోలు వైరల్..!

  • November 25, 2020 / 10:35 AM IST

రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు సుధీర్ బాబు. పాత్ర ఏదైనా సరే వందకు వంద శాతం తన బెస్ట్ ఇవ్వడానికి తాపత్రయపడుతుంటాడు. ఫలితం నిరాశపరిచినా.. వెనకడుగు వెయ్యడు. చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడే అయినప్పటికీ.. ఆయన క్రేజ్ ను వాడుకోవాలని అస్సలు ఆలోచించడు. అప్పుడప్పుడు మహేష్ బాబు ని తన సినిమా వేడుకలకు మాత్రమే పిలుస్తూ ఉంటాడు. ‘ఎస్.ఎం.ఎస్’ ‘ప్రేమ కథా చిత్రం’ ‘భలే మంచి రోజు’ ‘సమ్మోహనం’ వంటి గుర్తుండిపోయే సినిమాలు సుధీర్ బాబు నుండీ వచ్చాయి.

ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే సుధీర్ బాబు మంచి అందగాడు కూడా అన్న సంగతి తెలిసిందే. అతని ఫిజిక్ బాలీవుడ్ హీరోలకు కూడా ధీటుగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇతని వయసు కూడా 40ఏళ్ళు అన్నా నమ్మేలా ఉండదు. అలాంటి సుధీర్ బాబుకి 14ఏళ్ళ కొడుకు ఉన్నాడు అంటే నమ్మబుద్ది అవుతుందా? కానీ ఇది నిజం. సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల నిర్వహించారు.

అదే రోజున కృష్ణ, ఇందిర గార్ల పెళ్లి వేడుక కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలు చూసిన ఘట్టమనేని అభిమానులు.. ‘సుధీర్ బాబుకి ఇంత పెద్ద కొడుకున్నాడా’ అని సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus