Dhruv Vikram: హాట్ టాపిక్ గా మారిన విక్రమ్ కొడుకు ప్రేమాయణం!

  • January 3, 2022 / 02:56 PM IST

తమిళస్టార్ హీరో, విలకష్ణ నటుడు విక్రమ్ చియాన్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో ధృవ్ తమిళ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నటి బనిత సంధు హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే.. బనిత, ధృవ్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేగాక.. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ పలు తమిళ మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి.

ఈ క్రమంలో న్యూఇయర్ కి ధృవ్ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు చూస్తుంటే వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ జంట కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడ హోటల్ రూమ్ లో బనితతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ దానికి బ్యాక్ గ్రౌండ్ ‘డార్కెస్ట్ హోల్డ్ ఆన్ వీ ఆర్ గోయింగ్ హోమ్’ అనే ఇంగ్లీష్ పాటను జత చేశారు. అంతేకాదు..

బనిత తమ హోటల్ రూమ్ బాల్కనీలో నిలబడిన ఫొటోను కూడా షేర్ చేస్తూ.. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ చేశారు ధృవ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధృవ్, బనితలను ఇలా చూసిన అభిమానులు అంతా షాక్ అవుతున్నారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జంట రిలేషన్ లో ఉన్నట్లు చెప్పకనే చెప్పారు.

ఇక ధృవ్ రెండో సినిమా విషయానికొస్తే.. ఆయన ‘మహాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus