SSMB28: మహేష్‌ – త్రివిక్రమ్‌ ఆ హీరోయిన్‌ ఫిక్స్‌ అయ్యిందా!

  • July 18, 2022 / 03:56 PM IST

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమాకు సెకండ్‌ హీరోయిన్‌ ఎంపికే పెద్ద సమస్య అనే విషయం మీకు తెలిసిందే. సినిమాలో రెండో హీరోయిన్‌ కోసం టీమ్‌ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తోందని, ఇంకా ఎవరూ ఫైనల్‌ అవ్వలేదని మన సైట్‌లో చదివి ఉంటారు కూడా. అయితే ఈ క్రమంలో ఓ హీరోయిన్‌ను గురూజీ టీమ్‌ ఫిక్స్‌ చేసింది అని చెబుతున్నారు. నానితో ‘గ్యాంగ్‌ లీడర్‌’లో నటించిన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ను మహేస్‌ సినిమా కోసం తీసుకోవాలని త్రివిక్రమ్‌ అనుకుంటున్నారట.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రియాంకకు పాత్ర గురించి చెప్పారని టాక్‌. సినిమాలో ఆమె సెకండ్‌ హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. ఫస్ట్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంచుకున్న విషయం తెలిసిందే. పేరుకే ఫస్ట్‌, సెకండ్‌ కానీ.. రెండు పాత్రలు సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయని టాక్‌. అందుకోసమే వెతికి వెతికి ‘డాన్‌’ భామను పట్టుకున్నారని చెబుతున్నారు. ఈమె ఓకే అయితే ఆగస్టు నుండి చిత్రీకరణ ప్రారంభించేయొచ్చు అని తెలుస్తోంది.

మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా రూపొందుతోంది. రిలీజ్‌ అయినప్పటికి ఇది 12 ఏళ్లుగా మారుతుందనే విషయం తెలిసిందే. ఆగస్టు రెండో వారంలో సినిమా ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమా కథ, పేరు విషయంలో గతంలో కొన్ని పుకార్లు వచ్చాయి. ‘అతడు’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఉంటుందని కొందరు అన్నారు. అందుకే సినిమా పేరు ‘పార్థు’ అని పెడుతున్నారు అని కూడా చెప్పారు.

అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్‌ ఢిల్లీ రాజకీయాల గురించి చర్చించబోతున్నారు అని తాజాగా వినిపిస్తోంది. మహేష్‌ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడా లేదా అనేది తెలియదు కానీ, సినిమాలో రాజకీయాల ప్రస్తావన గట్టిగా ఉంటుందని చెబుతున్నారు. మరి పొలిటికల్‌ టచ్‌ ఉన్న కథలో మహేష్‌ ఎలా నటిస్తాడో చూడాలి. తన కుటుంబంలో రాజకీయ నాయకులు ఉండటం, కృష్ణ ఫ్యామిలీ ఓ పార్టీకి దగ్గరగా ఉండటంతో మహేష్‌కి పొలిటికల్‌ రంగు అంటడం అంత మంచిది కాదనేది నెటిజన్ల అభిప్రాయం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus