Rakul Preet: అధికారులకు రకుల్ చెప్పిన సమాధానాలు ఇవే!

  • September 4, 2021 / 02:43 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపుగా ఆరు గంటల పాటు ఈడీ అధికారులు రకుల్ ను విచారించారు. రకుల్ ను అధికారులు 30 కంటే ఎక్కువ ప్రశ్నలు అడగగా ఆ ప్రశ్నలకు రకుల్ సమాధానాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. రకుల్ ను అధికారులు కెల్విన్ గురించి, కెల్విన్ తో వాట్సాప్ చాటింగ్ గురించి,

ఎఫ్ క్లబ్ పబ్ ఖాతాకు నిధుల బదిలీకి సంబంధించిన ప్రశ్నలు అడిగారని, సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో రకుల్ కు ఉన్న సంబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అయితే రకుల్ మాత్రం కెల్విన్ ను తాను చూడలేదని ఎఫ్ క్లబ్ కు ఒక్కసారి మాత్రమే వెళ్లానని చెప్పినట్టు సమాచారం. తాను మనీ ల్యాండరింగ్ కు పాల్పడలేదని అవసరమైతే బ్యాంక్ అకౌంట్లను పరిశీలించాలని రకుల్ చెప్పినట్టు తెలుస్తోంది. తాను డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వినియోగించలేదని రకుల్ చెప్పారని సమాచారం.

ఈ నెల 6వ తేదీన రకుల్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆరోజు షూటింగ్ పనులతో బిజీగా ఉండటం వల్ల రకుల్ ముందుగానే విచారణకు హాజరయ్యారు. పార్టీ ఫుటేజ్, ఎన్సీబీ ఇచ్చిన నోటీసుల వల్ల రకుల్ కు నోటీసులు జారీ అయ్యాయని సమాచారం. డ్రగ్స్ క్రయవిక్రయాల్లో భారీగా మనీ లాండరింగ్ జరిగిందనే సమాచారం వల్ల డ్రగ్స్ కేసులో ఈడీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

1

2

3

4

5

6

7

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus