Heroines: గర్భం దాల్చాక పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్లు.. ఇప్పటివరకు వీళ్లే ఇలా!

  • April 25, 2023 / 03:33 PM IST

సోషల్‌ మీడియాలో ఇటీవల కొద్ద రోజులుగా ఓ వార్త, దాని కింద కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే అలాంటి వార్తలు రావడం అరుదు, వాటికి అలాంటి సమాధానలు రావడం ఇంకా అరుదు అని చెప్పొచ్చు. అలాంటి అరుదైన ఘటనే తల్లాయ్యాకనే పెళ్లి. మీకు ఇప్పటికే విషయం అర్థమయ్యే ఉంటుంది. ఇలియానా ఇటీవల షేర్‌ చేసిన ఓ ఫొటో వల్ల వచ్చిన డిస్కషన్‌ ఇది. దీంతో గతంలో ఇలాంటి పని చేసింది ఎవరు అనే చర్చ మొదలైంది.

ఆ చర్చకు తగ్గట్టుగా బాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు గతంలో ఈ పని చేశారు. అంటే పెళ్లి కాకముందేనే తల్లి అయిన వాళ్లు కొందరు అయితే, మరికొందరు పెళ్లి అయిన కొద్ది నెలలకే బిడ్డను కన్నవాళ్లు కొందరు. ఇటీవల ఇలియానా కూడా ఇలానే ‘తల్లి’ అనే అనందకరమైన మాట ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడంతో ‘తండ్రి ఎవరు?’ ఎవరూ అంటూ ఓ రేంజిలో ట్రోలింగ్‌ జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి ట్రోలింగ్‌లు జరిగాయి. వాళ్లు కూడా స్టార్‌ హీరోయిన్లే.

రీసెంట్‌గా ఇలాంటి వార్తలు చెప్పిన హీరోయిన్ల లిస్ట్‌ తీసుకుంటే.. తొలుత చెప్పాల్సిన పేరు ఆలియా భట్‌. పెళ్లి అయిన కొన్ని రోజలకే బిడ్డ స్కానింగ్‌ ఫొటోను బయటపెట్టి షాక్‌ ఇచ్చింది జంట. అలా పెళ్లికి ముందే తను గర్భం దాల్చిన విషయాన్ని ఆమె బయటపెట్టింది. సీనియర్‌ నటి నేహా ధూపియా కూడా ఇలానే. ఆమె కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఆ విషయం బయటకు వచ్చిన తర్వాతే నేహా ధూపియా, అంగద్ బేడీ పెళ్లి అయ్యింది. 2018 మేలో పెళ్లి జరిగితే, ఆ ఏడాది నవంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చారు.

2021లో కథానాయిక దియా మీర్జా, 2020లో కల్కి కొచ్లిన్‌ కూడా ఇలానే జన్మనిచ్చారు. ఆ తర్వాతనే వీరి వివాహాలు జరిగాయి. వీళ్లే కాదు అమీ జాక్సన్ కూడా ఇలానే తన ప్రెగ్నెన్సీని ముందే ప్రకటించింది. బిడ్డ పుట్టిన తర్వాతనే అమీ తన పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇలియానా కూడా ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అవుతోంది అని చెప్పాలి. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పాలి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus