Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

ఎవరికీ అంచనాలు లేకుండా.. థియేటర్లలో వచ్చి ఓ సినిమా విజయం సాధించడం తెలుగులో తక్కువగా చూస్తుంటాం. అలా ఇప్పుడు దసరా సందర్భంగా వచ్చిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా అలాంటి విజయాన్నే అందుకుంది. ప్రముఖ ఉత్తరాంధ్ర బుర్ర కథ కళాకారిణి గరివిడి లక్ష్మీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ బయోపిక్ ఇప్పుడు థియేటర్లలో మంచిగా ఆడుతూ వస్తోంది. ఆనంది టైటిల్ రోల్‌లో నటించిన ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు.

Garividi Lakshmi

ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలు నిర్మిస్తూ వచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఈసారి పూర్తిగా పంథా మార్చుకుని ఓ జీవిత కథను తీసుకొచ్చారు. ఈ సినిమా కథను గౌరి నాయుడు జమ్ము.. చాలా ఏళ్లుగా సిద్ధం చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లకు కథ నెరేట్‌ కూడా చేశారు. అలా నెరేషన్‌ తీసుకున్న వారిలో ముగ్గురు హీరోయిన్ల పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆయనే ఈ మాటలు చెప్పారు.

సినిమా టైటిల్ రోల్ కోసం ముందుగా స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, నివేదా థామస్, నిత్యా మీనన్‌కు కథ వినిపించి, సినిమా గురించి చెప్పారట. కానీ ఆ ముగ్గురూ వివిధ కారణాల వల్ల వారు ఓకే చేయలేదట. దీంతో ఇంతమంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు అనే చర్చ వస్తోంది. నిజానికి పై ముగ్గురిలో సాయి పల్లవి ఆ పాత్రకు పక్కాగా సరిపోతారు అని చెప్పాలి. ఎందుకంటే గరివిడి లక్ష్మి పాత్ర కేవలం నటన మాత్రమే కాదు.. డ్యాన్స్‌ కూడా.

నివేదా థామస్‌, నిత్యా మీనన్‌ నటన విషయంలో పేరు పెట్టడానికి లేదు. అయితే గరివిడి లక్ష్మి వేసిన మాస్‌ డ్యాన్స్‌ చూశాక ఈ ఇద్దరూ అంత ఈజీ కాదు. అయితే వారిని తక్కువగా అంచనా వేయలేం. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు చేసినా సినిమా మరో లెవల్‌కి వెళ్లేది.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus