సుకుమార్ చేస్తున్న సిల్వర్ స్క్రీన్ మాయ..!

  • February 13, 2021 / 07:42 PM IST

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్ పుష్ప సినిమాని తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రీసంట్ గా రంపచోడవరంలో షూటింగ్ ని ఫినిష్ చేస్కున్న యూనిట్ తర్వాత షెడ్యూల్ ని కేరళలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సోషల్ మీడియాలో వస్తున్న హైప్ అలాగే పబ్లిసిటీ ఇప్పుడు చిత్రయూనిట్ కి సవాల్ గా మారింది. సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా చిన్న చిన్న సీన్స్ ని సైతం తీస్తున్నారట. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని తెరకెక్కిస్తున్నారు. కేరళ షెడ్యూల్ గ్యాప్ లో చిన్న చిన్న సీన్స్ ని సిటీలో షూట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఇందులో ఎక్కడా కూడా అల్లు అర్జున్ మాత్రం ఉండడట.

హైదరాబాద్ శివార్లలో లారీలు టోల్ గేట్ దాటే సీన్స్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఛేజింగ్ షాట్స్ ని అవుటర్ లో ప్లాన్ చేసినట్లుగా సమాచారం తెలుస్తోంది. అంతేకాదు, ఇప్పటి వరకూ ఈసినిమా అద్దిరిపోయే అవుట్ పుట్ వచ్చిందట. ఇప్పటికే తీసిన రషెష్ చూసిన యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో ఉందని టాక్. రీసంట్ గా సుకుమార్ ఉప్పెన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప సినిమా గురించిన హైలెట్స్ ని చెప్పారు. అంతేకాదు, దేవిశ్రీ ప్రసాద్ అయితే కొండపైన షాట్ అద్దిరిపోతుందని, 500మందితో తీసిన ఈ సీన్ అలాగే, బన్నీ ఇంట్రోకి గుస్ బంప్స్ పక్కా వస్తాయని సినిమాపై హైప్ ని క్రియేట్ చేశాడు. దీంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరో మేటర్ ఏంటంటే, ఈ సినిమాని ఐదుభాషల్లో కాకుండా పది భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో హైలెట్ సీన్స్ చాలా ఉన్నాయని, ఇది ప్యాన్ ఇండియన్ స్టోరీగా ఉంది కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. సినిమాలో బన్నీ ఇంట్రో సీన్స్, అలాగే అడవిలో చేజింగ్ సీన్స్ , రాత్రిపూట నైట్ ఎఫెక్ట్ లో చూపించే షాట్స్ అద్దిరిపోయోలా ఉంటాయని టాక్. దీనికోసం హాలీవుడ్ టెక్నీషన్ టీమ్ వర్క్ చేస్తోంది.

అలాగే, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ ఆల్బమ్ సినిమాని ఒక రేంజ్ లోకి తీస్కునివెళ్తుందట. ఉప్పెన మ్యూజిక్ కంటే కూడా పుష్ప సాంగ్స్ ఒక లెవల్లో ఉండబోతున్నాయని సమాచారం. మొత్తానికి సుకుమార్ అండ్ టీమ్ పుష్పరాజ్ ని దుమ్మురేపేలా చూపించడానికి ఫిక్స్ అయిపోయారు. సిల్వర్ స్క్రీన్ పైన తన మాయని మరోసారి ప్రేక్షకులకి చూపించబోతున్నాడు సుక్కూ. అదీ మేటర్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus