అల్లూరి – భీమ్ ల టైం పాస్ : పోస్ట్-పోన్ అయిన ‘చెక్’ : రికార్డుల ‘ఉప్పెన’

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం సెట్లో అల్లూరి(చరణ్), భీమ్(ఎన్టీఆర్) లు టైం పాస్ చేస్తూ ఉన్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. బ్రేక్ టైం వీళ్లిద్దరూ షూటింగ్ కోసం రిహార్సల్స్ చేస్తూ కామెడీ చేసుకుంటున్నట్టు ఈ ఫోటోలు చూస్తే స్పష్టమవుతుంది. ఓ ఫొటోలో ఎన్టీఆర్ నవ్వుతూ కనిపిస్తే.. చరణ్ సీరియస్ గా కూర్చున్నాడు. మరో ఫొటోలో చరణ్ నవ్వుతుంటే.. ఎన్టీఆర్ సీరియస్ గా ఉండడాన్ని మనం గమనించవచ్చు.

ఫిబ్రవరి 19న విడుదల కావాల్సిన ‘చెక్’ చిత్రాన్ని ఫిబ్రవరి 26కి పోస్ట్-పోన్ చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలయ్యి.. యూట్యూబ్లో హల్ చల్ చేస్తుంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కాగా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ ను నిన్న సాయంత్రం విడుదల చేశారు.దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24గంటల్లోనే ఈ ట్రైలర్ కు 5.59 మిలియన్ల వ్యూస్ నమోదు కాగా.. 284K లైక్ లు పడటం విశేషం. ఓ రకంగా ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను మరింత పెంచేసిందనే చెప్పాలి.


Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus