సురేష్ బాబు కొత్త వ్యాపారం : విజయ్ కొత్త సినిమా టైటిల్ : ప్రకాష్ రాజ్ కు మెగా సపోర్ట్

టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరని చెప్పాలి. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఖర్చుపెట్టే ప్రతీ రూపాయిని కరెక్ట్ గా వినియోగించుకోవాలని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఆయన మరో కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ఆడియో రంగంలో ఆదిత్య మ్యూజిక్ కు ఇప్పటివరకు తిరుగులేదు. బయటవాళ్ల నుండి పోటీ ఉన్నా.. ఈ రంగంలో ఆదిత్యదే పైచేయి. యూట్యూబ్ హక్కులు తీసుకుంటూ.. దానిపై ఆదాయం సంపాదించడంలో ఆదిత్య అందరికంటే ముందుంటుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే అప్డేట్ వచ్చేసింది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన కొత్త సినిమా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ బర్త్ డే సందర్భంగా 65వ సినిమా అప్డేట్ వస్తుందని అన్నారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.దానికి తగ్గట్లే టెరిఫిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘మా’ ఎలెక్షన్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఈ అసోసియేషన్ కు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఈసారి కూడా ‘మా’ ఎన్నికలు సంచలనం సృష్టించేలా ఉన్నాయి. కన్నడ నటుడు ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. అధికారికంగా ప్రకటించకపోయినా.. హీరో మంచు విష్ణు కూడా ఈసారి ఎలెక్షన్స్ లో పోటీ పడతారని అంటున్నారు.అయితే ప్రకాష్ రాజు ఈ ఎన్నికల కోసం గత రెండు నెలలుగా సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు మెగాస్టార్ మద్దతు కీలకం కాబట్టి ముందుగానే ఆయన్ను సంప్రదించి.. అనుమతి, మద్దతు రెండూ తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. మంచు విష్ణు పోటీ చేస్తాడనే విషయంపై ఎలాంటి ప్రకటన లేదు. దీంతో మెగాస్టార్ కు ఈ విషయంలో క్లారిటీ రాలేదు. అందుకే ముందుగా తనను సంప్రదించిన ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చేశారని టాక్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలందరూ కూడా తమ అకౌంట్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆడియన్స్ తో నేరుగా కనెక్ట్ అవుతున్నారు. తమ వ్యక్తిగత విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. హీరో హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా సోషల్ మీడియాలో హవా నడిపిస్తున్నారు. సురేఖా వాణి, ప్రగతి లాంటి నటీమణులు సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పదిరోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారితే ఆచార్య దసరా రేసులో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వరుస మూవీ ఆఫర్లతో బిజీ అవుతున్న సంగీత ఆచార్య మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాకు సంగీత పాత్ర కీలకమని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read   


Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus