Beast Movie: ‘బీస్ట్’ గా దళపతి టెరిఫిక్ లుక్!

  • June 21, 2021 / 07:59 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే అప్డేట్ వచ్చేసింది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన కొత్త సినిమా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ బర్త్ డే సందర్భంగా 65వ సినిమా అప్డేట్ వస్తుందని అన్నారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

దానికి తగ్గట్లే టెరిఫిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

‘బీస్ట్’ అంటూ ఇంగ్లీష్ టైటిల్ తో పోస్టర్ ను వదిలారు. ఇందులో విజయ్ పెద్ద గన్ పట్టుకొని.. విలన్లను పరిగెత్తించేందుకు రెడీ అవుతున్నట్లు ఉన్నారు.కట్ బనియన్ లో విజయ్ మాస్ లుక్ టెరిఫిక్ గా ఉంది. మొత్తానికి విజయ్ తన అభిమానులకు పుట్టినరోజు నాడు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. కొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus