ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో హైలైట్స్ అవేనట

  • April 4, 2020 / 02:52 PM IST

ఆర్ ఆర్ లో రామరాజుగా చరణ్ పాత్రను రాజమౌళి పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ కి పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో కూడిన వీడియో చరణ్ రోల్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఇక భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ పాత్ర పరిచయం ఎలా ఉండబోతుందని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున కొమరంభీమ్ గా ఎన్టీఆర్ ని పరిచయం చేయనున్నారు.

ఐతే చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు అంటూ వచ్చిన వీడియోలో ఎన్టీఆర్ తన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. చరణ్ ని పరిచయం చేయడానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వాడిన రాజమౌళి, ఎన్టీఆర్ ని పాత్ర పరిచయం కోసం చరణ్ వాయిస్ ఓవర్ వాడతారని అందరూ భావిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోలో చరణ్ వాయిస్‌ ఓవర్ ఉండదట.అలాగే ఎన్టీఆర్ స్వయంగా కొన్ని పవర్ ఫుల్ డైలాగ్‌లను చెబుతారని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ పులితో ఫైట్ సన్నివేశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన విజువల్స్ ను కూడా చూచాయగా రివీల్ చేయబోతున్నారని టాక్. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా భారీగా ఈ వీడియో ఉండనుందని వస్తున్న సమాచారం. మే 20న రాజమౌళి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఇవ్వడం ఖాయం అని తెలుస్తుంది. డి వి వి దానయ్య 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus