Honey Rose: నీకేమైనా పిచ్చి పట్టిందా అంటున్న నెటిజన్లు..!

దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు చెబుతున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో అందం ఉన్నప్పుడే నాలుగు అవకాశాలు దక్కించుకుని నాలుగు పైసలు వెనకేసుకోవాలి. కానీ అందం ఉండి టైం బాగోలేకపోతే వచ్చిన అవకాశాలతోనైనా ఇండస్ట్రీలో లైనప్ లో ఉండాల్సిందే. ప్రస్తుతం ఇదే లెక్కలు తూచా తప్పకుండా ఫాలో అవుతుంది మలయాళీ కుట్టి హనీ రోజ్. అప్పుడెప్పుడో ఆలయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా వచ్చిన సంగతి పోయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలీదు.

దీంతో అసలు ఆ హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందా అన్న ఆశ్చర్యం కలిగింది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత తన అదృష్టం తలుపు తట్టి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాతో తను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత అమ్మడికి సినిమా అవకాశాల కంటే షాపుల్లో రిబ్బన్ కటింగ్స్ కే ఆఫర్లు ఎక్కువ గా వచ్చాయి. అంతేకాదు సోషల్ మీడియాని తన అందచందాలతో ఆడేసుకుంది.

ఇక రీసెంట్ గా హనీ రోజ్ (Honey Rose) ఓ కుర్ర హీరోతో ఐటమ్ సాంగ్ చేయడానికి ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” సినిమాలో అమ్మడు ఐటమ్ సాంగ్ చేయబోతుందట. ఇన్నాళ్లు హీరోయిన్ రోల్స్ కోసం చూసిన హనీ రోజ్ ఎంత ఎదురు చూసినా అవకాశాలు రాకపోవడంతో డబ్బుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటున్నారు నెటిజన్స్.

మొత్తానికి వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకోవడం చాలా తృప్తిగా ఉంటుందంటూ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న హనీరోజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ పాట్ హిట్ అయితే హనీ రోజ్ కు ఆఫర్లు వస్తాయేమో చూడాల్సిందే.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus