ఆర్ ఆర్ ఆర్ హీరోల గెటప్స్ అంతుపట్టడం లేదుగా..?

  • April 3, 2020 / 05:37 PM IST

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. ఆర్ ఆర్ ఆర్ టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి చరణ్ పుట్టినరోజు కానుకగా భీమ్ ఫర్ రామరాజు వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు. దీనితో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక హీరో ఇంట్రడక్షన్ వీడియోతోనే ప్రేక్షకులకు అనేక ఫజిల్స్ వదిలారు రాజమౌళి.

అల్లూరి సీతారామరాజుగా చరణ్ ని పోలీస్ గెటప్ లో పరిచయం చేశాడు. యూనిఫార్మ్ లో మీసం తిప్పుతున్న రామ్ చరణ్, చొక్కాలేకుండా పోలీస్ బెల్ట్, ప్యాంటు ధరించి వీర విహారం చేశారు. ఆ పాత్ర చూసిన తరువాత రామ్ చరణ్ పోలీస్ అధికారిగా కనిపిస్తారని అర్థం అవుతుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే చరణ్ ఈ చిత్రంలో మరో రెండు గెటప్స్ లో కనిపిస్తారట. ఇక చరణ్ కనిపించనున్న మిగతా ఆ రెండు గెటప్స్ ఏమై ఉంటాయనే ఆసక్తి ఇప్పుడు అభిమానులలో మొదలైంది.

ఇక ఓ గెటప్లో చరణ్ ఒరిజినల్ అల్లూరి సీతారామ రాజు లుక్ లో కనిపిస్తాడట. వాస్తవానికి దూరంగా కాల్పనికత జోడించి రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తుండగా, ఇందులోని పాత్రల తీరు, కథనం అనేది అంతుబట్టకుంది. రాజమౌళి కావడంతో ఫ్యాన్స్ సైతం ఖచ్చితంగా అద్భుతంగా తీస్తాడు అని ఫిక్స్ అయిపోయారు. మరో వైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొమరం భీమ్ గా ఆయన ఇంట్రడక్షన్ కోసం వేచి చుస్తున్నారు. అనేక ప్రత్యేకతల మధ్య రానున్న ఆర్ ఆర్ ఆర్ ఎన్ని అద్భుతాలు చేయనుందో చూడాలి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus