Hrithik, Jr NTR: ‘వార్ 2’ లో ఎన్టీఆర్ ఫిక్స్… స్వయంగా హృతిక్ క్లారిటీ ఇచ్చేశాడుగా !

  • May 20, 2023 / 06:16 PM IST

గత కొంతకాలంగా ఎన్టీఆర్.. ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ‘బ్రహ్మాస్త్రం’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ ని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ టీం కానీ, ‘వార్ 2’ నిర్మాతలు కానీ ఈ విషయం పై నేరుగా స్పందించి క్లారిటీ ఇచ్చింది అంటూ ఏమీ లేదు. బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం ఇది నిజమే అని చెబుతూ వచ్చారు. అయినా తెలుగు ప్రేక్షకులు… చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వస్తే తప్ప ఏదీ నిజమని ఫిక్స్ అవ్వరు.

ఈరోజు ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు. ఎలాగూ ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ వస్తాయి కాబట్టి.. ‘వార్ 2’ గురించి కూడా అప్డేట్ వస్తుందేమో చూద్దాం అన్నట్టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు. చిత్ర బృందం ఇంకా ఈ విషయం పై స్పందించలేదు కానీ.. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ తో కలిసి నటించబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

హృతిక్ తన ట్వీట్ ద్వారా స్పందిస్తూ.. ” హ్యాపీ బర్త్ డే తారక్. కొత్త సంవత్సరం ఆనందంతో, యాక్షన్ తో నిండిపోవాలని కోరుకుంటున్నాను. యుద్ధభూమిలో నీ కోసం ఎదురుచూస్తుంటాను. నేను కలిసే వరకు నీ రోజులన్నీ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ పేర్కొన్నాడు.అయితే హృతిక్ ‘వార్2’ సినిమా గురించి అని నేరుగా చెప్పలేదు కానీ.. ‘యుద్దభూమి’ లో అనే లైన్ వాడడంతో… అదే సినిమా అని కన్ఫర్మ్ చేసినట్టు అనుకోవాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus