“అవతలివారిని జడ్జ్ చేయాలనుకోవడం వ్యక్తిత్వం లేనివారు చేసే పని. అది ఎలాంటి పరిస్థితిలో అయినా సరే” అంటూ హృతిక్ రోషన్ ఇవాళ చేసిన ఈ ట్వీట్ ఎవరి గురించో ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు.
గత కొన్ని నెలలుగా హృతిక్-కంగనల మధ్య వార్ నడుస్తోంది. హృతిక్ పరువు తీయడానికి ఉన్న దారులన్నీ వాడేసిన కంగనా.. చివరికి అవన్నీ కల్పితాలే అని తెలిసిపోవడంతో మిన్నకుండిపోయింది. కానీ.. నిన్నటివరకూ సైలెంట్ గా ఉన్న హృతిక్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. “కంగనాకు క్యారెక్టర్ లేదు” అంటూ ఇండైరెక్ట్ గా ఎటాక్ చేసాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగనా కూడా సైలెంట్ గా ఉండిపోయింది!