Mana ShankaraVaraPrasad Garu: వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

గత కొన్ని నెలలుగా సౌత్‌ సినిమాల విషయంలో వినిపిస్తున్న పెద్ద చర్చ. మ్యూజిక్‌ రైట్స్‌. ఏదైనా సినిమాలో ఓ పాత పాట వాడితే.. ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆ సినిమా టీమ్‌కు ఓ నోటీసు వస్తోంది. ఇలా నోటీసులు ఎక్కువగా ఇచ్చిన సంగీత దర్శకుడు ఇళయరాజా కాగా.. అందుకున్న వారిలో చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనేగా డౌట్‌. రీసెంట్‌గా వచ్చిన ఓ పెద్ద సినిమాలో పాత పాటలు చాలానే వాడేశారు. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేదే పాయింట్‌.

Mana ShankaraVaraPrasad Garu

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా, వెంకటేశ్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకర్‌ వరప్రసాద్‌ గారు’. సినిమా జనవరి 12న విడుదలైంది. ఈ సినిమా తొలి రోజు సుమారు రూ.84 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ విషయం అలా ఉంచితే.. ఇందులో వాడిన పాటల గురించే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి, వెంకటేశ్‌ కెరీర్‌లో అదిరిపోయే విజయం అందుకున్న పాటలు కొన్నింటిని భలేగా వాడేశారు.

‘దళపతి’ సినిమాలోని ‘సుందరి నేనే నువ్వంట..’ అనే పాటలను ఓ నాలుగైదు సార్లు వాడేశారు. ఆ పాటకు సంగీతం అందించింది ఇళయరాజా. ఆయన దగ్గర అనుమతి తీసుకొని (డబ్బులు చెల్లించే) సినిమాలో వాడేశారు. అన్ని సౌత్‌ భాషల్లో ఆ ట్యూన్‌ని బాగా వాడుకున్నారు. ఆ పాట కాకుండా ‘చూడాలని ఉంది’లో ‘రామ్మా చిలకమ్మా..’ పాట, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని పాటను కూడా వాడుకున్నారు.

వీటన్నింటి కోసం సినిమా ప్రొడ్యూసర్‌లు బాగానే ఖర్చు చేశారట. సుమారు రూ. కోటి ఖర్చయింది అని సమాచారం. ఈ నేపథ్యంలో కొంతమంది అనుమానిస్తున్నట్లు ఈ సినిమా మీద ఇళయరాజా కానీ, లేక ఏ ఇతర దర్శకుడు కానీ సంగీతం వాడేశారు అనే చర్చ ఉండదు అని చెప్పొచ్చు. అందరు నిర్మాతలు ఇలా చేస్తే ఆ తర్వాత ఇబ్బందులు ఉండవు.

25 రోజులు రాత.. 75 రోజులు తీత

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus