టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) గత కొన్నేళ్లుగా లక్ కలిసొస్తుంది. వరుస విజయాలు బాలయ్య రేంజ్ ను ఊహించని స్థాయిలో పెంచేస్తున్నాయి. అఖండ (Akhanda) , వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ2 సినిమా బడ్జెట్ ఏకంగా 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమాకు బాలయ్య లేటెస్ట్ లెక్కల ప్రకారం ఈ బడ్జెట్ వర్కౌట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బోయపాటి శ్రీను సైతం బాలయ్య సినిమాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సినిమాల సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. స్కంద సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకున్న నేపథ్యంలో బోయపాటి శ్రీను తర్వాత సినిమాల కోసం మరింత కసితో పని చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి శ్రీను (Boyapati Srinu) రెమ్యునరేషన్ల కోసమే బడ్జెట్ లో 30 శాతం ఖర్చు అవుతోందని భోగట్టా.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఒకింత భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య బాబీ (K. S. Ravindra) సినిమాను పూర్తి చేసి ఈ సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది. అఖండ2 సినిమాకు బాలయ్య ఎక్కువ డేట్లు కేటాయించాల్సిన అవసరం అయితే ఉందని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమాలో కథ, కథనం కొత్తగా ఉంటాయని ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అఖండ సీక్వెల్ తో బాలయ్య, బోయపాటి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో చూడాలి. బాలయ్య ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా క్రేజీ, మాస్ సినిమాలతో బాలయ్య అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు.