Laya: ఆ డైరెక్టర్ నన్ను బెదిరించాడు.. లయ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో లయ (Laya) ఒకరనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు నటిగా వెలుగు వెలిగిన లయ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న తమ్ముడు (Thammudu) సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం గమనార్హం. అభినయ ప్రధాన పాత్రల్లో మాత్రమే నటించిన లయ తాజాగా ఒక సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను అమెరికా వెళ్లిపొయిన తర్వాత నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారని ఆమె అన్నారు.

నేను అడుక్కుతింటున్నానని నేను రోడ్డున పడ్డానని ఇంకా ఎన్నో వదంతులు సృష్టించారని లయ పేర్కొన్నారు. ఆ వదంతులను గుర్తు చేసుకుంటే ఎంతో బాధ కలుగుతుందని ఆమె అన్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఇండియాకు వచ్చానని లయ వెల్లడించడం గమనార్హం. ఒకానొక సమయంలో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న దర్శకుడు నన్ను ఫాలో అయ్యాడని ఆమె పేర్కొన్నారు. బేగంపేటలో కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని ఆయన బెదిరించాడని లయ అన్నారు.

నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయానని ఆమె తెలిపారు. ఆ డైరెక్టర్ అక్కడికి కూడా అనుసరిస్తూ వచ్చాడని లయ వెల్లడించడం గమనార్హం. మీరు చంపుతారన్నా నేనేం చేయలేనని ఇక్కడ ఎవరూ లేరని మీ ఇష్టం చంపేయండి అని అన్నానని లయ పేర్కొన్నారు. లయ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆ దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

రీఎంట్రీలో లయకు ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం దక్కుతోందని తెలుస్తోంది. లయను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. లయకు తెలుగులో రీఎంట్రీ ఇస్తే ఆమెకు మరిన్ని ఆఫర్లు పెరిగే అవకాశాలు ఉంటాయి. లయ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. లయకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus