KGF2: కేజీఎఫ్2 మూవీ క్రేజ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే?

  • April 14, 2022 / 12:18 PM IST

యశ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్1 సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సక్సెస్ వల్ల కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. గతంలో ఏ సౌత్ సినిమా చేయని స్థాయిలో బిజినెస్ చేసిన కేజీఎఫ్2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఊహించని రికార్డులను సొంతం చేసుకుంటోంది.

Click Here To Watch NOW

అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమా 10,000కు పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రముఖ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌ అయిన బుక్ మై షో, పేటీఎంలలో 40 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో కేజీఎఫ్2 రిలీజ్ కు ముందు అదే స్థాయిలో సంచలనాలను సృష్టించడం గమనార్హం. ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభ, యశ్ నటన వల్ల ఈ సినిమాకు ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

యశ్ కు జోడీగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి నటించగా ప్రకాష్ రాజ్, రావు రమేష్, రవీనా టాండన్, సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. కేజీఎఫ్2 మూవీ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుందా? లేదా? తెలియాల్సి ఉంది. కేజీఎఫ్2 సినిమా టాక్ ను బట్టి ఈ సినిమా కలెక్షన్లు డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ సినిమాకు కచ్చితంగా లాంగ్ రన్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్2 సినిమా గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఫిక్షనల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కగా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాల కోసం ఏకంగా ఎనిమిదేళ్లు కష్టపడ్డారు. కేజీఎఫ్ ఛాప్టర్2 కలెక్షన్ల రూపంలో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus