ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో కేజీఎఫ్2 సినిమా రిలీజ్ కానుంది. తెలుగులో రికార్డు స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరగగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కేజీఎఫ్ ఛాప్టర్1 భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే నార్త్ ఇండియాలో కేజీఎఫ్2 అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా నార్త్ లో ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ ను కేజీఎఫ్2 క్రాస్ చేసింది. సినిమా రిలీజ్ కు ఇంకా ఐదు రోజుల సమయం ఉండటంతో కేజీఎఫ్2 రిలీజ్ సమయానికి పరిస్థితి మారుతుందని అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. కేజీఎఫ్ ఛాప్టర్2 డబ్బింగ్ సినిమానే అయినా ఈ సినిమాపై ఊహించని స్థాయిలో హైప్ ఏర్పడింది.
రికార్డ్ స్థాయిలో కేజీఎఫ్2 సినిమాకు బిజినెస్ జరగగా ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. ఆర్ఆర్ఆర్ హిందీలో తొలిరోజు 19 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా కేజీఎఫ్2 ఆ సినిమాకు రెట్టింపు కలెక్షన్లను సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే కేజీఎఫ్2 సినిమా రిలీజ్ కు ఒకరోజు ముందు బీస్ట్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో బీస్ట్ సినిమా కేజీఎఫ్2 సినిమాపై కొంతమేర ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.
బాక్సాఫీస్ వద్ద బాహుబలి2, ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డులను కేజీఎఫ్2 బ్రేక్ చేస్తుందేమో చూడాలి. ప్రేక్షకుల్లో దర్శకునిగా ప్రశాంత్ నీల్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ సినిమా సక్సెస్ ప్రశాంత్ నీల్ కు కీలకమని చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలలో ప్రభాస్, తారక్ హీరోలుగా నటిస్తున్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!