సైరా కోసం హైదరాబాద్ లో సిద్ధమైన మరో భారీ సెట్

  • April 9, 2018 / 07:17 AM IST

తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘సైరా నరసింహారెడ్డి‘ షూటింగ్ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. డైరక్టర్ సురేందర్ రెడ్డి రీసెంట్ గా హోమానికి సంబంధించిన సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ షూటింగ్ లో నయనతార, అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ఈ చిత్రీకరణ ఫోటోలు మెగా అభిమానులకు ఆనందాన్ని అందించాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక రెండో షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోనే మరో భారీ సెట్ సిద్ధం చేశారు.

అల్యూమినియం ఫ్యాక్టరీలో కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ ను రూపొందించారు. కర్నూలులోని కోయిలకుంట్ల ప్రాంతంలో ఉన్న ట్రెజరీని కొల్లగొట్టి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిషువారిపై తన తిరుగుబాటును ప్రారంభించారు. ఆ ముఖ్యమైన చారిత్రిక ఘట్టం కోసమే ఈ సెట్ ను వేశారు. ఇక్కడ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి లు కీలక పాత్రలు పోషించనున్నారు. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus