Narne Nithin: ఆదిలోనే హంసపాదు.. ఎన్టీఆర్ బావమరిదికి అదృష్టం కలిసిరావట్లేదా?

కరోనా థర్డ్ వేవ్ తర్వాత నుంచి తెలుగు సినిమాలకు సరైన రిలీజ్ డేట్ ను ఎంపిక చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరైన ప్లానింగ్ లేకుండా థియేటర్లలో విడుదలైన సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం లేదు. పెద్ద సినిమాలకు పోటీగా విడుదలైన చిన్న సినిమాలు సైతం ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతుండటం గమనార్హం. అయితే ఈ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కావాల్సిన సలార్ మూవీ తప్పుకోవడంతో రూల్స్ రంజన్, మ్యాడ్ సినిమాలు ఆ తేదీకి రావాలని ఫిక్స్ అయ్యాయి.

పెదకాపు1 సినిమా సైతం ఈ నెల 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే రామ్ పోతినేని స్కంద మూవీ ఊహించని విధంగా ఈ నెల 28వ తేదీకి రిలీజ్ డేట్ ను మార్చుకోవడం గమనార్హం. స్కంద సినిమా డేట్ మారడంతో మిగతా సినిమాల మేకర్స్ కు టెన్షన్ మొదలైంది. స్కంద మూవీకి టాక్ ఎలా ఉన్నా ప్రేక్షకులలో ఎక్కువమంది ఈ సినిమాపై ఆసక్తి చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నటించిన మ్యాడ్ సినిమా ఈ నెల 28వ తేదీ నుంచి తప్పుకునే అవకాశం అయితే ఉందని ప్రచారం జరుగుతోంది. స్కంద సినిమాకు పోటీగా మ్యాడ్ మూవీ విడుదలైతే మ్యాడ్ మూవీ నష్టపోక తప్పదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మ్యాడ్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. నార్నె నితిన్ మూవీకి ఆదిలోనే హంసపాదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

నార్నె నితిన్ (Narne Nithin) కు నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ ఎంతో ఉంది. మ్యాడ్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించడం గమనార్హం. ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus