సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హంట్’. ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. శ్రీకాంత్, భరత్ వంటి పేరున్న నటీనటులు నటిస్తుండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.మొదటి ఈ చిత్రానికి చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఓ పక్క సంక్రాంతి పెద్ద సినిమాలు మరోపక్క బాలీవుడ్ మూవీ ‘పఠాన్’ దూకుడు ముందు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతుంది.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.09 cr |
సీడెడ్ | 0.04 cr |
ఆంధ్ర(టోటల్) | 0.09 cr |
ఏపీ +తెలంగాణ(టోటల్) | 0.22 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.02 cr |
గుంటూరు | 0.24 cr |
‘హంట్’ చిత్రానికి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.సుధీర్ బాబు గత చిత్రాలు ఈ టార్గెట్ కు తగ్గ కలెక్షన్లను అయితే రాబట్టలేకపోయాయి.’హంట్’ మొదటి రోజు రూ.0.24 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. ఇది నెగిటివ్ షేర్స్(డెఫిసిట్స్) వంటివి కాకుండా వచ్చిన కలెక్షన్లు అని తెలుస్తుంది. మరి వీకెండ్ ముగిసేవరకు ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!