అనసూయ రెమ్యూనరేషన్ ను బయట పెట్టేసిన హైపర్ ఆది..!

హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా … తన గ్లామరస్ ఫొటోలను తన సోషల్ మీడియాలో పెట్టి కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంటుంది హాట్ యాంకర్ అనసూయ. ఆ సమయంలో కొందరు ట్రోల్ చేస్తే వాళ్ళ పై ఫైర్ అవ్వడమే కాదు.. సైబర్ పోలీసులకి కూడా పిర్యాదు చేస్తుంది కూడా..! కాసేపు ఆ విషయాల్ని పక్కన పెడితే .. ఈమె క్రేజ్ మాత్రం పీక్స్ లో ఉందనేది నిజం. ఓ పక్క యాంకర్ గా రానిస్తూనే మరో పక్క సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ తన క్రేజ్ ను డబుల్ చేసుకుంటుంది.

ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న ‘అందాదున్’ రీమేక్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది అనసూయ. ఒరిజినల్ లో టబు చేసిన పాత్రని ఇక్కడ అనసూయ చేయబోతోంది. ఈ పాత్ర చాలా బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా మొన్నామధ్య అనసూయ పై ఐటీ రైడ్ లు జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. అంతలా ఈమె సంపాదిస్తుందా అని చాలా మంది ప్రశ్నించారు. వారికి హైపర్ ఆది ఆ విషయాన్ని స్పష్టం చేసాడు. ‘అనసూయ రేటు 3 లక్షలు… నాది 1 లక్ష మాత్రమే’ అంటూ ఓ స్కిట్ లో భాగంగా బయటపెట్టి షాక్ ఇచ్చాడు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus