మరోసారి గర్భవతిని అవుతానంటున్న హాట్ యాంకర్!

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ‘జబర్దస్త్’ షోతో ఆమె ఎంత పాపులారిటీ దక్కించుకుందో తెలిసిందే. తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మూడోసారి గర్భం దాల్చడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మళ్లీ తల్లిని కావాలనుందని ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏ విషయమైనా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటుంది అనసూయ. ఈ క్రమంలో ఎన్నోసార్లు ట్రోల్స్ బారిన పడింది. అయినప్పటికీ ఆమెలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

తన మనసులో మాటలను నిర్మొహమాటంగా బయటపెట్టేస్తుంది. తాజాగా తనకు మూడో బిడ్డ కావాలంటూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం అనసూయ ‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. అందులో అనసూయ నిండు గర్భిణిగా కనిపించి ఆశ్చర్యపరిచింది. అయితే అనసూయ మాత్రం గర్భిణి పాత్ర చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అంటోంది. సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా మళ్లీ గర్భవతిని కావడానికి తనకు ఎలాంటి అడ్డంకులు లేవనీ.. మూడో బిడ్డను కనడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది.

గర్భవతిగా ఉన్నప్పుడు అందరూ తనను ఎంతో బాగా చూసుకున్నారని.. ఆ గారాబం తనకెంతో నచ్చుతుందని.. అందుకే నిజజీవితంలో మరోసారి గర్భవతిని కావడం తనకిష్టమేనని అంటోంది. ఇద్దరు పిల్లలను కన్న తనకు అమ్మతనంలో ఉన్న అనుభూతి ఎలాంటిదో తెలుసనీ.. అందుకే ‘థాంక్యూ బ్రదర్’ సినిమాతో బాగా కనెక్ట్ అయ్యానని చెప్పింది. రమేష్ రాపర్తి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus