‘మనం’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ తర్వాత ‘సుప్రీమ్’ ‘బెంగాల్ టైగర్’ ‘తొలిప్రేమ’ ‘వెంకీమామ’ ‘ప్రతీరోజు పండగే’ వంటి హిట్ సినిమాల్లో కూడా నటించింది.మంచి క్రేజ్ ను అయితే సొంతం చేసుకుంది కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ఎన్టీఆర్ తో తప్ప మరే స్టార్ హీరోతోనూ ఈమె నటించే అవకాశాన్ని సంపాదించుకోలేకపోయింది. కెరీర్ ప్రారంభంలో ఈమె కాస్త ముద్దుగా బొద్దుగా ఉండేది.
ఇప్పుడు పూర్తిగా సైజ్ సన్నబడిపోయింది.అయితే హీరోయిన్లు ఫిట్నెస్ విషయంలో జాగ్రత్త వహించకపోతే వచ్చే ట్రోల్స్ ను ఫేస్ చేయడం చాలా కష్టం. ఇప్పటికే ఇలాంటి అంశాల పై చాల మంది హీరోయిన్లు తమ అనుభవాల్ని బయట పెట్టారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు రాశీ ఖన్నా కూడా బయటపడింది. ‘మొదట్లో రాశీని అంతా గ్యాస్ బండ అంటూ కామెంట్ చేసేవారట.ఆ టైములో ఈమె చాలా ఇబ్బందికి గురయ్యేదట. అప్పుడే లావు తగ్గాలని ప్రయత్నించినా….
పీసీఓడి సమస్య కారణంగా తగ్గలేకపోయిందట. లావు తగ్గడానికి చాలా టైం పట్టిందిని ఈమె చెప్పుకొచ్చింది.ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో ‘పక్కా కమర్షియల్’ వంటి సినిమాల్లో ఈమె నటిస్తుంది.తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా నటిస్తుంది.అలాగే బాలీవుడ్లో కూడా పలు సినిమాల్లో అలాగే వెబ్ సిరీస్లలో నటిస్తుంది. అయితే చాలా మంది హీరోయిన్లలానే రాశీ కూడా టాలీవుడ్ మీడియాతో షేర్ చేసుకోని బాలీవుడ్ మీడియాకి చెబుతుండడం గమనార్హం.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!