‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్: సుశాంత్ కి ప్రభాస్ స్పెషల్ విషెస్!

  • January 29, 2021 / 10:58 AM IST

టాలీవుడ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ సినిమాతో దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ విడుదల చేశాడు. సుశాంత్ కి స్పెషల్ విషెస్ చెప్పారు. ”నా లైఫ్‌లో అమ్మకు.. అమ్మాయికి.. బైక్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ” హీరో చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలైంది.

బైక్‌ పార్కింగ్‌ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని టీజర్‌ ను చూస్తే అర్ధమవుతోంది. తనకు ఎంతో ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్ కొనడం.. దానిపై హీరోయిన్ ని తిప్పడం.. అనంతరం నో పార్కింగ్ ప్లేస్ లో బైక్ ని పార్క్ చేయడం వంటి అంశాలను టీజర్ లో చూపించారు. బైక్ కారణంగా హీరో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేది సినిమాలో చూపించబోతున్నారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇందులో వెన్నెల కిషోర్, అభినవ్, వెంకట్ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus