ileana, Nagarjuna: ఇలియానాకు నాగ్ ఓకే చెబుతారా?

  • September 21, 2021 / 11:59 AM IST

స్టార్ హీరో నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఘోస్ట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపిక కాగా కాజల్ గర్భవతి అయ్యారని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అందువల్ల కాజల్ ఈ సినిమాలో నటించలేనని చెప్పినట్టు తెలుస్తోంది. కాజల్ స్థానంలో ఘోస్ట్ మేకర్స్ త్రిష, ఇలియానా పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. గతంలో నాగార్జున, త్రిష కాంబినేషన్ లో కింగ్ మూవీ తెరకెక్కింది.

నాగ్, ఇలియానా కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు. అయితే ఇలియానాకు నాగార్జున ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు ఇలియానాకు గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గాయి. అందువల్ల ఛాన్స్ వస్తే ఇలియానా వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉంది. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఇలియానాకు ఈ మూవీలో ఛాన్స్ దక్కకపోవచ్చు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఘోస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నాగ్ హీరోగా నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావడం లేదు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తానని నాగార్జున భావిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video



‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus