ప్రైవేట్ పార్ట్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన ఇలియానా

కెరీర్ పరంగా ఒడిడుకులు ఎదుర్కొంటున్న ఇలియానా మానసిక స్థితి ఏమిటో అర్థం కావడం లేదు. బాలీవుడ్ పై మనసుపడి, విదేశీయుడు ప్రేమలో పడి మొత్తంగా మునిగింది ఇలియానా. ప్రస్తుతం ఇలియానాకు ఇటు సౌత్ లోకాని అటు నార్త్ లోకాని చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. సినిమా అవకాశాల సంగతి ఎలా ఉన్నా, ఇలియానా సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. తన బాడీ పార్ట్స్ పై ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఓ బికినీ ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఇలియానా ‘నా శరీర ఆకృతి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తరచుగా బాధపడేదానిని. నా హిప్ వెడల్పుగా ఉందని, థైస్ పెద్దవిగా ఉన్నాయని, బ్రెస్ట్ చిన్నదిగా ఉన్నదని, నడుము సన్నగా లేదని, ముక్కు సూటిగా లేదని, పెదాలు సరిపడినంత లేవని, హైట్ లేనని, స్మార్ట్ కాదని, పర్ఫెక్ట్ గా లేనని బాధపడేదానిని. ఐతే ఎవరో నిర్ణయించే అందం అనే ఛట్రంలో నేను ఎందుకు ఇరుక్కుంటున్నానని, నా ఆలోచన విధానం మార్చుకోవడంతో పాటు అసాధారణమైన, భిన్నమైన అమ్మాయిగా తయారయ్యాను’ అని పెట్టారు.

అప్పట్లో ఇలియానా బెల్లీ అందానికి కోట్లలో ఫ్యాన్స్ ఉండేవారు. నటనకంటే కూడా తన గ్లామర్ తోనే బాగా ఫేమ్ తెచ్చుకున్న ఈ కలల రాణి తన అందంపై ఇంత పెద్ద అనుమానాలు ఎలా ఏర్పరుచుకుందని అందరూ అనుకుంటున్నారు. పోతపోసిన అందంగా ఉండే ఇలియానా తనని తాను ఎందుకు అంతలా కించ పరుచుకుందని బాధపడుతున్నారు. ఇలియానా సోషల్ మీడియా పోస్ట్ పై వింత వింత కామెంట్స్ వస్తున్నాయి.


Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus