సన్నబడ్డాను అని ఇలియానా ఇండైరెక్ట్ గా ఎక్స్ ప్రెస్ చేస్తుందే..!

కొద్దిరోజులుగా గోవా బ్యూటీ ఇలియానా సోషల్ మీడియాలో ఇస్తున్న హాట్ ట్రీట్ ను మాటల్లో వర్ణించలేము. ఛాన్స్ దొరికినప్పుడల్లా బికినీ ధరించి ఓ రేంజ్లో కుర్ర కారుని రెచ్చకొడుతుంది ఈ బ్యూటీ. ‘దేవదాసు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇలియానా..ఆ వెంటనే ‘పోకిరి’తో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,రవితేజ,రానా.. వంటి టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించిన ఇలియానా..

ఆ తరువాత బాలీవుడ్ పై ఉన్న మోజుతో తెలుగు సినిమాలను పక్కన పెట్టింది. అలాగని బాలీవుడ్లో కూడా ఈమె హవా చూపించింది ఏమీ లేదు. ఇప్పుడైతే అసలు అవకాశాలే లేవు. మధ్యలో విదేశీయుడు ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ మొదలుపెట్టి ఫిట్నెస్ ను కూడా కోల్పోయింది.దాంతో అక్కడి దర్శకనిర్మాతలు ఈమెను పక్కన పెడుతూ వస్తున్నారు.ఇప్పుడు సన్నపడడానికి ఎక్కడ లేని ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఈ బ్యూటీ నడుము మడతల్ని చూపిస్తూ ఇచ్చిన ఫోజు

ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఇలియానా అద్దంలో తన నడుమును చూసుకుంటూ ఉన్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇల్లీ బేబీ.. నేను స్లిమ్ అయ్యాను అని ప్రేక్షకులకు సింబాలిక్ గా చెబుతుందా? లేక కుర్రకారుని నిద్ర లేకుండా చెయ్యాలని ఈ వీడియోలు పోస్ట్ చేసిందా అని కొంతమంది కామెంట్స్ చేస్తుండడం గమనార్హం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus