కాజల్ సీక్రెట్ ను కనిపెట్టేసిన ఇలియానా?

  • July 11, 2020 / 07:00 PM IST

టాలీవుడ్ హీరోయిన్స్ లో కాజల్ తెలివితేటలు మామూలుగా ఉండవు. ఎవర్ని ఎక్కడ ఉంచాలో.. దేనిని ఎలా ఉపయోగించుకోవాలో ఈ అమ్మడుకి బాగా తెలుసు. అందుకే కెరీర్ ప్రారంభించి 13 ఏళ్ళు అవుతున్నా.. ఇంకా ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది కాజల్. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించేసింది కాజల్. మహేష్ బాబు, చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో అయితే రెండేసి సినిమాలు చేసే ఛాన్స్ దక్కించుకుంది.

ఇప్పుడు సీనియర్ హీరోల సరసన కూడా నటించడానికి రెడీ అయిపోయింది. టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కష్టాలు గట్టిగా ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన కాజల్ వాళ్ళ సినిమాల్లో నటిస్తే ఎక్కువ పారితోషికాన్ని వసూల్ చేసే ఛాన్స్ ఉంటుందని పసిగట్టేసింది. అయితే ఊహించని విధంగా ఇలియానా.. కాజల్ కు ఝలక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. విషయం ఏమిటంటే.. ఇలియానా కూడా సీనియర్ స్టార్ హీరోల సరసన నటించడానికి రెడీ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దాంతో చాలా మంది దర్శక నిర్మాతలు ఇలియానాను సంప్రదించడం మొదలు పెట్టారట.

గ్లామర్ షో విషయంలో కాజల్ అడ్డుచెప్తుంది కానీ.. ఇలియానా అయితే అస్సలు అడ్డు చెప్పదు. పైగా కాజల్ కంటే తక్కువ పారితోషికానికే ఇలియానా రెడీ అంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఇలియానాకు ఎక్కువ అవకాశాలు లేవు.. అలా అని ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొన్నటికి మొన్న నితిన్- మేర్లపాక గాంథీ ల ‘అందాదున్’ రీమేక్ కోసం కూడా ఈమెను సంప్రదించారు.అయితే అందులో విలన్ పాత్రకు అనుకోండి. అయినప్పటికీ యంగ్ హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలియానాతో వర్క్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సమాచారం. దీనిని బట్టి చేసుతుంటే కాజల్ కు .. ఇలియానా పెద్ద దెబ్బ వేసే అవకాశం ఉందనే చెప్పాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus