అయితే వెబ్‌సిరీస్, లేదంటే టాక్ షో… ఓటీటీల ఆలోచన ఈ మధ్య కాలంలో ఇలానే నడుస్తోంది. ఒక హీరోయిన్ డేట్స్ దొరికాయి అంటే వాళ్ల ఆలోచన ఈ రెండింటిలో ఒకవైపు వెళ్లిపోతోంది. రెండింటికీ ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వస్తుండటం ఇక్కడ విశేషం. అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు, సిరీస్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మన దేశంలో అమెజాన్ ప్రైమ్ పెద్దగా టాక్ షోలు చేసిన దాఖలాలు లేవు. అయితే లోకల్ ఓటీటీల పోటీనో, కొత్త ఆలోచనో కానీ టాక్ షో చేయాలని నిర్ణయించిందట.
అమెజాన్ ప్రైమ్ టాక్ షో కోసం టీమ్ ఇలియానాను సంప్రదించిందట. దానికి ఆమె సుముఖత వ్యక్తం చేయడంతో ఒప్పందాలు కూడా జరిగిపోయాయని వినికిడి. అయితే ఎప్పుడు షో మొదలవుతుంది. ఎవరెవరు వస్తారు ఆ షోలోకి అనేది తెలియడం లేదు. ఓటీటీల్లోకి విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లకు సంబంధించిన నటీనటులతో షో చేస్తారా? లేక అందరితోనూ చేస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇలియానాను హోస్ట్ అంటున్నారు కాబట్టి కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ టాక్షోనే అవుతుంది.
అన్నట్లు ఈ టాక్ షో కోసం ఇలియానాకు పెద్ద పారితోషికం అందబోతోందట. ఓటీటీ కాబట్టి ఎలాగూ సీజన్స్ ఉంటాయి. అందుకే తొలి సీజన్లో షోకి వచ్చే స్పందన చూసి, రెండో సీజన్ పారితోషికం, హోస్ట్ లాంటివి ఓకే చేస్తారు. ప్రముఖ దర్శకుడి ఆధ్వర్యంలో ఈ టాక్ షో నడుస్తుందని సమాచారం. ఆ దర్శకుడు దక్షిణాదికి చెందినవాడని కూడా అంటున్నారు. ఎవరా దర్శకుడు అనేది తెలియడం లేదు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!