ileana: గోవా బ్యూటీ ఇలియానా మేకప్ లెస్ పిక్ వైరల్..!

  • July 28, 2021 / 06:16 PM IST

2006వ సంవత్సరంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇలియానా డెబ్యూ మూవీ ‘దేవదాస్’.. బ్లాక్ బస్టర్ అవ్వడం, రెండో సినిమా ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం లభించింది. టాలీవుడ్లో రూ.1 కోటి పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ ఇలియానానే కావడం విశేషం. అయితే తన సొంత ఇండస్ట్రీ పై ఉన్న మోజుతో ఈమె బాలీవుడ్ కు చెక్కేసింది.

కానీ ఈమెకు అక్కడ కలిసొచ్చింది ఏమీ లేదు. పోనీ వెంటనే తప్పు తెలుసుకుని టాలీవుడ్ కు వచ్చేసిందా అంటే.. అది కూడా లేదు.ఈరోజున ఇలియానాకి ఆఫర్లు లేని పరిస్థితి వాటిల్లింది. ఈ పరిస్థితి నుండీ తప్పించుకోవడానికి కిందా మీదా పడి ఫోటో షూట్లలో పాల్గొంటుంది కానీ.. వాటి వల్ల కూడా ఈమెకు ఉపయోగం లేకపోయింది.అయినప్పటికీ వరుసగా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే వస్తుంది. అయితే తాజాగా ఈమె మేకప్ లేకుండా ఉన్న పిక్ ను కూడా షేర్ చేసింది.

‘ఇది నేనే. నో మేకప్, నో ఫిల్టర్’ అంటూ ఆ ఫొటోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫోటోలో ఇలియానా బ్లూ డ్రెస్ లో ఉండడాన్ని మనం గమనించవచ్చు. వ్యాయామం చేసిన తర్వాత తీసుకున్న సెల్ఫీ పోస్ట్ చేసినట్టు వివరించింది ఇలియానా.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus