నటి ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఇలియానా అనంతరం తన అదృష్టాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పరీక్షించుకోవడం కోసం అక్కడికి వెళ్లారు అయితే అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సౌత్ ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు. ఇలా ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు అనంతరం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈ విధంగా ఇలియానా సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసేవారు. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఇలియానా ఏకంగా తాను తల్లి కాబోతున్నాను అంటూ బాంబ్ బ్లాస్ట్ చేశారు. అసలు ఈమె పెళ్లి చేసుకుందా లేదా అన్న విషయం ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు కానీ ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మాత్రం ప్రమోట్ అయ్యారు.
ఇక తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాల గురించి కూడా ఎక్కడా చెప్పని ఇలియానా తన ప్రియుడి ఫోటోని మాత్రం షేర్ చేశారు. అయితే ఇప్పటివరకు ఈయన పూర్తి వివరాలు కానీ ఆయనతో ఆమెకు పెళ్లి జరిగిందా లేదా అన్న విషయాలు కానీ తెలియలేదు. ఇక కుమారుడు జన్మించిన తర్వాత కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నటువంటి ఈమె తన కుమారుడికి అనారోగ్యం చేయడంతో ఎంత బాధ అనుభవించారో అనే విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
తన కుమారుడికి అనారోగ్యం చేసినప్పుడు తన గుండె ఎంతో వేతనతో కొట్టుకుందని తెలిపారు. అయితే ఈ బాధ ఎలా ఉంటుంది అనే విషయాలను ఎవరు చెప్పలేరని కేవలం ఒక అమ్మాయి అమ్మగా మారితే తప్ప ఆ బాధ తెలియదు అంటూ ఇలియానా తెలిపారు. ఇక తన ప్రియుడు గురించి కూడా చెబుతూ ఆయన తాను కష్టాలలో ఉన్నప్పుడు తన కన్నీటిని తుడిచారని తన పక్కన ఉంటే అంత సంతోషంగానే ఉంటుంది అంటూ ఇలియానా (ileana) తన ప్రియుడు గురించి కూడా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు