ఈ మధ్య కాలంలో యూట్యూబ్ రీల్స్ ద్వారా, సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కుమారి ఆంటీ తన ఇంటర్వ్యూల ద్వారా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను సైతం చెబుతున్నారు. నేను 2009 సంవత్సరంలో హైదరాబాద్ కు వచ్చానని ఆమె కామెంట్లు చేశారు. ఆ సమయంలో నేను క్లాత్స్ కుడుతూ జీవనం సాగించేదానినని కుమారి ఆంటీ పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రముఖ సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట పని కూడా చేశానని హేమచంద్ర తల్లి ఎంతో ప్రేమగా చూసుకునేవారని అమాయకురాలిలా ఉన్నావని ఇలా ఉంటే ఎలా బ్రతుకుతావని హేమచంద్ర తల్లి చెప్పేవారని కుమారి ఆంటీ చెప్పుకొచ్చారు.
నాకు తెలియని పనులను ఏ విధంగా చేయాలో ఆమె చెప్పేవారని హేమచంద్ర తల్లి ఎంతో మంచివారని కుమారి అంటీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో జీవించాలంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుందని అందువల్ల ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టానని ఆమె తెలిపారు. ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టిన సమయం నుంచి సెలబ్రిటీలు కూడా తమ దగ్గర ఫుడ్ తీసుకెళ్లే వారని కుమారి ఆంటీ తెలిపారు.
కుమారి ఆంటీ (Kumari Aunty) బిజినెస్ ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని తెలుస్తోంది. రోజుకు 5 వేల రూపాయల నుంచి 6 వేల రూపాయల వరకు లాభం వస్తుందని ఆమె చెబుతున్నారు. నా చేతి వంట రుచి చూసి సందీప్ కిషన్ 10,000 రూపాయలు ఇచ్చాడని కుమారి ఆంటీ వెల్లడించారు.
బిగ్ బాస్ షో గురించి అవగాహన లేదని ఆ షో నుంచి ఆఫర్ వచ్చినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె తెలిపారు. కుమారి ఆంటీ చెబుతున్న విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కుమారి ఆంటీకి కొన్ని టీవీ షోలకు గెస్ట్ గా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఓవర్ నైట్ లో వచ్చిన పాపులారిటీ వల్ల కుమారి ఆంటీకి బిజినెస్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!