NTR New Car: ఆ కారు ఎన్టీఆర్ కారు కాదా?

  • July 24, 2021 / 05:10 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలు మార్కెట్లోకి వచ్చిన కొత్త కార్లను కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కొత్తకారును కొనుగోలు చేశారని ఒక వార్త నిన్న తెగ వైరల్ అయింది. ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి తారక్ కొనుగోలు చేసిన కారు ఇదేనంటూ కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ ఆ కారులో వెళ్లి చరణ్ ను కలిసినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతుండటం గమనార్హం. సంవత్సరం క్రితమే ఎన్టీఆర్ లంభోర్ఘిని యూరస్ కారు కొరకు అడ్వాన్స్ ఇచ్చాడని ఆ కారు ఇంకా డెలివరీ కాలేదని తెలుస్తోంది. చరణ్ ఇంటి ముందు పార్క్ చేసి నిన్న తెగ వైరల్ అయిన కారు మరొకరి కారు అని సమాచారం. అయితే రాబోయే కొన్ని నెలల్లోనే కొత్త కారు ఎన్టీఆర్ సొంతం కానుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నారు. వరుసగా పాన్ ఇండియా కథలను ఎన్టీఆర్ ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రష్మిక, అమలా పాల్ సైతం ఈ మధ్య కాలంలో కొత్త కార్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కార్ల కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండటం గమనార్హం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus