బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నటువంటి అమర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సీరియల్ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అమర్ కన్నడ నటి తేజస్విని గౌడ అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజు తన పెళ్లి గురించి పలు విషయాలను తెలిపారు.
వీరిద్దరిది ప్రేమ వివాహం అని చాలామంది భావించారు. కానీ తమది ప్రేమ వివాహం కాదని పెద్దలు కుదుర్చిన వివాహం అంటూ ఈమె తెలియజేశారు. తాను అమర్ ఒకరోజు అనుకోకుండా వన్డే బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత తనతో పరిచయమైంది. అయితే అంతకుముందే తెలుసు కానీ తనతో బాగా మాట్లాడటం అదే మొదటిసారి అని తెలిపారు. ఇక ఆరోజు చాలా లేట్ అవ్వడంతో అమర్ నన్ను డ్రాప్ చేస్తావా అంటూ తనని అడిగానని అమర్ డ్రాప్ చేశారని తెలిపారు.
అప్పటినుంచి ఇద్దరం ఫోన్లో మాట్లాడుకోవడం ఇలా మా ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది అయితే ఒక రోజు ఉన్న ఫలంగా అమర్ నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటూ అడిగారు అయితే ఈ విషయం ఇంట్లో వారితో మాట్లాడమని చెప్పాను అలా తన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా ఇంట్లో మాట్లాడారని మా ఇంట్లో కూడా ఒప్పుకోవడంతో ఇద్దరికీ పెళ్లి జరిగింది అంటూ ఈ సందర్భంగా తేజు తెలిపారు.
ఇలా మాది ప్రేమ వివాహం కాదని పెద్దలకు కుదిర్చిన వివాహం అంటూ ఈమె తెలియజేశారు. అయితే వీరిద్దరికీ పరిచయం ఏర్పడినది బిగ్ బాస్ వన్డే కార్యక్రమంలోనేనని వీరి పెళ్లికి బిగ్ బాస్ కారణం అంటూ తాజాగా ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నటువంటి అమర్ (Amardeep) టైటిల్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!