Allu Ayaan: అయాన్ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరా?

  • November 22, 2023 / 03:47 PM IST

సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం సర్వసాధారణంగా జరిగే అంశమని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలో వారసులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ వారసుడిగా తన కుమారుడు అయాన్ కూడా ఇండస్ట్రీలోకి వస్తారని అందరూ భావిస్తున్నారు. అల్లు అర్జున్ కుమార్తె అర్హ ఇప్పటికే బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

చదువు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి హీరోగా వస్తారని అందరూ భావిస్తున్నారు. తాజాగా అయాన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయాన్ జాతకం ప్రకారం ఈయనకు సినిమాలు పెద్దగా కలిసి రావు అంటూ ఈ వార్త సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ కథనం ప్రకారం అయాన్ జాతకం ప్రకారం ఈయనకు సినిమాలు పెద్దగా కలిసి రావని సినిమాలలోకి వచ్చిన పెద్దగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇక అయాన్ (Allu Ayaan) సినిమాలలో కంటే కూడా రాజకీయరంగంలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంటారని తెలుస్తోంది. ఈయన జాతకం ప్రకారం సినిమా ఇండస్ట్రీలోకి రావడం కంటే రాజకీయాలలోకి వెళ్తేనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని ఈయనకు పొలిటికల్ రంగంలోనే సక్సెస్ వస్తుందంటూ ఈ వార్తలు వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

అదేంటి పాన్ ఇండియా స్టార్ హీరో కుమారుడు సినిమాలలో సక్సెస్ కాకపోవడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus