Katrina Kaif Pregnant: కత్రినా తల్లి కాబోతున్నారా… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్!

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో నటించి సందడి చేశారు. అనంతరం బాలకృష్ణ సినిమాలో కూడా నటించిన కత్రినా కైఫ్ పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే కత్రినా కైఫ్ గత రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నుపెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెద్దల సమక్షంలో రెండు సంవత్సరాలు క్రితం వైవాహిక జీవితంలోకి స్థిరపడ్డారు. ఇలా పెళ్లయినప్పటికీ ఈ దంపతులు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా కైఫ్ తాజాగా లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమె ఈ ఫోటోలపై చాలామంది కామెంట్లు చేస్తూ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈమె సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఈద్ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ పార్టీకి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.ఇక కత్రినా కైఫ్ సైతం ఈ పార్టీలో లాంగ్ అనార్కలి ఫ్రాక్ ధరించి చాలా అందంగా బొద్దుగా కనిపించారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఫోటోలలో కత్రినా కాస్త బొద్దుగా ఉండడంతో కత్రినా తల్లి కాబోతున్నారా అందుకే ఇలా తయారయ్యారా అంటూ కొందరు కామెంట్లు చేయగా ఈమె ఉద్దేశపూర్వకంగానే తన ప్రెగ్నెన్సీ ని దాస్తున్నారా అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus