పూజా హెగ్దే ఆ హీరోతో ప్రేమాయణం.. నిజమయ్యేలా ఉందే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరంటే … టక్కున చెప్పే పేరు పూజా హెగ్దేనే. వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించడంతో పాటు వరుసగా హిట్లందుకుంటూ దూసుకుపోతుంది. అంతేకాదు భారీగా పారితోషికం అందుకుంటుంది అని కూడా సమాచారం. ప్రస్తుతం ఈ బ్యూటీ అఖిల్ కు జోడీగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో నటిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ చిత్రంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 20 వ చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్. తమిళం నుండీ కూడా ఈమెకు పెద్ద ఆఫర్లు వస్తున్నాయి కానీ ఈమె మాత్రం ఇంకా సైన్ చెయ్యలేదు. ఇదిలా ఉంటే…బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహాన్‌ మెహ్రాతో… పూజా హెగ్డే ప్రేమలో పడిందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

‘బజార్’ చిత్రంతో మంచి పాపులర్ అయిన ఈ నటుడితో పూజా హెగ్డే.. డేటింగ్‌లో ఉందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలు నిజమే అని సమాచారం. ముంబై లోని కొన్ని ప్రదేశాలలో వీరిద్దరూ కలిసి ఉండగా.. కొందరు అతి ఉత్సాహకులు తమ ఫోన్లతో క్లిక్ మనిపించారు. వీరితో పాటు అనిల్ కపూర్ కొడుకు హర్ష వర్దన్ కపూర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో పూజా నే క్లారిటీ ఇవ్వాలి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus