హీరోయిన్ సీన్స్ పై రాజమౌళి ఫోకస్!

  • March 19, 2021 / 06:44 PM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్లు సెన్సేషన్ సృష్టించాయి. త్వరలోనే జోరుగా సినిమా ప్రమోషన్స్ చేయనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నిజానికి మార్చి నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలనేది ప్లాన్. కానీ ఇప్పుడు మే వరకు షూటింగ్ జరిగే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.

రామ్ చరణ్ మధ్యలో ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొనడం, ఎన్టీఆర్ టీవీ షో కోసం సమయం కేటాయించడంతో ఇప్పుడు షూటింగ్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ముందుగా అలియాపై కొన్ని సన్నివేశాలు ఓ పాటను చిత్రీకరించాలని అనుకున్నారు రాజమౌళి. కానీ ఇప్పుడు అలియా పాత్రను పెంచేసినట్లు తెలుస్తోంది. అదనంగా కొన్ని సీన్లు, మరో పాటను ఈమె కోసం యాడ్ చేసినట్లు సమాచారం.

బాలీవుడ్ లో అలియాకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. హీరోలతో సమానంగా ఆమెకి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు వారందరినీ థియేటర్ కి రప్పించడం కోసం రాజమౌళి.. అలియా రోల్ ని మరింత పెంచాలని నిర్ణయించుకున్నారట. గెస్ట్ రోల్ లా ఉంటే వర్కవుట్ అవ్వదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియా లాంటి నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus