Allu Arjun: సెకండ్‌ పార్ట్‌ కోసం ఫస్ట్‌ పార్ట్‌లో ఇచ్చిన ఆ ‘మెగా’ లింక్‌ ఏంటో తెలుసా?

  • October 18, 2023 / 07:13 PM IST

ఇప్పుడు తీసే సినమాకు, తర్వాత ఎప్పుడో తీసే సినిమాకే లింక్‌లు పెట్టి సినిమాటిక్‌ యూనివర్స్‌ అని పేరు పెడుతున్నారు. అలాంటిది రెండు పార్టులుగా తీసే సినిమాకు లింక్‌లు పెట్టకుండా ఉంటారా? కచ్చితంగా పెడతారు. అయితే సెకండ్‌ పార్ట్‌లో ఓ సీన్‌ కోసం ఫస్ట్‌ పార్ట్‌లో లింక్‌ పెట్టారని తెలుసా? అంత పక్కాగా చేశారు కాబట్టే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే న్యూస్‌ బయటకు వచ్చింది అని అంటున్నారు. పనిలోపనిగా ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ కూడా ఖుష్‌ అయితే ఖబర్‌ ఇది.

‘పుష్ప’రాజ్‌, శ్రీవల్లి ఓ బ్రిడ్జ్‌ మీద మాట్లాడుకునే సీన్‌ గుర్తుందా? ఆ సమయంలో శ్రీవల్లి ఫ్రెండ్స్‌తో కలసి ‘చూడాలని ఉంది’ సినిమాకు వెళ్లాలి అనుకుంటుంది. అంటే శ్రీవల్లి చిరంజీవి ఫ్యాన్‌ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్‌ పట్టుకునే సెకండ్‌ పార్ట్‌లో భలే సీన్‌ను రాసుకున్నారని టాక్‌. ఆ మాటకొస్తే ఆ సీన్‌ షూట్‌ చేశారు అని కూడా అంటున్నారు. రెండో పార్టులో కూడా శ్రీవల్లి చిరంజీవి సినిమాకు వెళ్తుందట. ఈసారి భర్త ‘ఫుష్ప’రాజ్‌ తో కలసి అన్నమాట. అక్కడ పుష్ప కూడా చిరు ఫ్యాన్‌ అని చూపిస్తారట.

అదేంటీ… తొలి పార్టులో ఆ మాట ఎక్కడ లేదు కదా అంటారా? అక్కడ ఆ పాయింట్‌ డిస్కస్‌ చేసే అవకాశమే రాలేదు అనుకోండి. అయితే రెండో పార్టులో భర్తతో కలసి శ్రీవల్లి సరదాగా బయటకు వచ్చి సినిమాకు వెళ్తారట. ఆ సినిమానే ‘ఇంద్ర’ అని అంటున్నారు. సినిమా చూస్తున్న సమయంలో థియేటర్లలో పుష్ప సందడి మామూలుగా ఉండదు అని చెబుతున్నారు. ఈలలు, గోలలు, స్టెప్పులు, డైలాగ్‌లతో రెచ్చిపోతాడట. దాంతోపాటు అతని మీద విలన్‌ గ్యాంగ్‌ దాడి చేస్తే.. ఫైట్‌ కూడా చేస్తాడట.

దీంతో ఆ సీన్‌ సినిమాలో భారీ హైలైట్‌గా నిలుస్తుంది అంటున్నారు. ఇక అ సందడి ఏంటో చూడాలి అంటే ఆగస్ట్ 15, 2024వరకు ఆగాల్సిందే. అప్పుడ ‘పుష్ప’రాజ్‌ రెండోసారి థియేటర్లలో వస్తాడు. అయితే మరి ఆ రోజు థియేటర్లలో (Allu Arjun) ‘పుష్ప’రాజ్‌ వీణ స్టెప్‌ వేస్తాడేమో చూడాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఆ స్టెప్‌ అంత ఫేమస్‌ మరి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus