Kalyan Ram: కల్యాణ్‌రామ్‌ కొత్త సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ రూమర్‌!

  • December 15, 2022 / 04:58 PM IST

ఎప్పుడో ఒక హిట్‌.. ఆ తర్వాత నెట్టుకురావడం.. గత కొన్నేళ్లుగా కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌ ఇలానే సాగుతోంది. ‘పటాస్‌’తో మంచి హిట్‌ కొట్టిన కల్యాణ్‌రామ్‌ మళ్లీ ఆ స్థాయి వసూళ్ల సాధించడానికి ‘బింబిసార’ వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో ‘అమిగోస్‌’ అంటూ త్వరలో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మీద పెద్ద హైప్‌లు ఏమీ లేవు. కానీ రీసెంట్‌గా బయటకు వచ్చిన ఓ పుకారు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కల్యాణ్‌ రామ్‌ – రాజేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ‘అమిగోస్‌’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయాలని చూస్తున్నారు. నిజానికి డిసెంబరులోనే సినిమా వస్తుంది అనుకున్నారు కానీ.. కాస్త ఆలస్యం చేసి సంక్రాంతి తర్వాత రిలీజ్‌ చేస్తున్నారు. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. ఇందులో ముగ్గురు ఫ్రెండ్స్‌ ఉంటారట. ఆ ముగ్గరూ కల్యాణ్‌ రామ్‌ అని అంటున్నాయి చిత్ర వర్గాలు.

‘అమిగోస్‌’ చిత్రానికీ ఎన్టీఆర్ ‘జై ల‌వ‌ కుశ‌’ సినిమా క‌థ‌కి కొన్ని ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయని చెబుతున్నారు. ‘జై ల‌వ‌ కుశ‌’ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. ‘అమిగోస్‌’ సినిమాలో క‌ల్యాణ్ రామ్ ది ట్రిపుల్ రోల్ అనే విషయం తెలిసిందే. ‘జై ల‌వ‌ కుశ‌’ సినిమాలో ముగ్గురు ఎన్టీఆర్‌లు ఉంటే… అందులో ఇద్ద‌రివి పాజిటివ్ పాత్రలు, ఒక‌టి నెగిటీవ్ పాత్ర‌. ఇప్పుడు ‘అమిగోస్’ సినిమాలో కూడా అంతే. ఓ క‌ల్యాణ్ రామ్ ఈ సినిమాలో విల‌న్‌గా కనిపిస్తాడట. అంతేకాదు ఒకేలా కనిపించే ముగ్గురి క‌థ ఈ సినిమా అంటున్నారు.

ఒకేలా ఉండే ముగ్గురూ ఎలా క‌లిశారు? క‌లిశాక వారి జీవితాల్లో ఏం జ‌రిగింది? అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఓ యాప్ చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని, అలాంటి పాయింట్ ఇప్ప‌టివ‌ర‌కూ టాలీవుడ్‌లో రాలేద‌ని టీమ్‌ చెబుతోంది. మరి ఆ యాప్ ఏమిటి? ఈ ముగ్గురి క‌థేమిటి అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ‘టెంపర్‌’ సినిమాకు దగ్గర కథతో ‘పటాస్‌’ వచ్చి హిట్టయింది. ఇప్పుడు ‘జై లవ కుశ’ కథకు దగ్గరగా ఉన్న ‘అమిగోస్‌’తో కల్యాణ్‌రామ్‌ హిట్‌ కొడతాడా?

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus