బాలయ్య మూవీ కోసం ఎన్టీఆర్ వస్తున్నారా..?

  • March 29, 2021 / 12:50 AM IST

నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా అదృష్టం పరీక్షించుకున్నా ప్రస్తుతం ఇండస్ట్రీ లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సత్తా చాటుతున్నారు. అయితే గత కొన్నేళ్ల నుంచి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఈ మధ్య కాలంలో జరగలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాబాయ్ తో తనకు విభేదాలు లేవని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే బాబాయ్ అబ్బాయ్ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.

బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చేతుల మీదుగా బాలకృష్ణ సినిమా టైటిల్ రివీల్ కానుందని సమాచారం. మొదట ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ వినిపించగా ఆ తరువాత బోయపాటి శ్రీను గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ రోజున బాలకృష్ణ సినిమా టైటిల్ కు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుంది. అయితే టైటిల్ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా విడుదల కాబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్న ఈ వార్త నిజమైతే మాత్రం నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం దమ్ము అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాకపోయినా ఈ సినిమా వల్ల బోయపాటి శ్రీను ఎన్టీఆర్ మధ్య బలపడింది. బోయపాటి శ్రీను అడిగితే ఎన్టీఆర్ నో చెప్పే అవకాశాలు ఉండవు. బాబాయ్ అబ్బాయ్ ఒకే వేదికపై సందడి చేస్తారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus