Neha Shetty: రెండో ‘టిల్లు’ గురించి క్లారిటీ ఇచ్చేసిన నేహా శెట్టి… ఏం చెప్పిందంటే?

  • October 3, 2023 / 07:02 PM IST

‘డీజే టిల్లు’ ఇటీవల కాలంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్‌ మూవీ. అదేంటి సినిమాలో బోల్డ్‌ సీన్స్‌ అంతగా లేవు కదా అనుకుంటున్నారా? మేం చెప్పేది సన్నివేశాల గురించి కాదు. సినిమాలో చెప్పిన విషయం గురించి. అందులో చర్చించిన అంశాల గురించి. అందుకేనేమో సినిమా కుర్రకారుకు తెగ నచ్చేసింది. జనాలు ఎగబడి సినిమా చూసేశారు. అందులో రాధిక అలియాస్‌ నేహా శెట్టి చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది.

చాలా నెలల క్రితమే మొదలైన ఈ సినిమా ఎందుకో కానీ వరుస వాయిదాలు పడుతూ వస్తోంది. తొలుత దర్శకుడు విషయంలో, ఆ తర్వాత హీరోయిన్‌ విషయంలో ఇలా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది. ఇప్పుడు అంతా కుదురుకుని సినిమా షూటింగ్‌ జరుగుతోంది అనుకోండి. అయితే ఇటీవల ఓ పుకారు వచ్చింది. అదే రెండో ‘టిల్లు’లో కూడా రాధిక కనిపిస్తుంది అని. ఇటీవల ‘రూల్స్‌ రంజన్‌’ సినిమా ప్రచారం కోసం నేహా శెట్టి మీడియా ముందుకు వచ్చింది.

ఈ సందర్భంగా ఆమెను మీరు మళ్లీ రాధికగా మారబోతున్నారా? అని అడిగితే… క్లారిటీ ఇచ్చేసింది. ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాలో నేను ఎలాంటి గెస్ట్‌ రోల్‌ చేయడం లేదు. ‘టిల్లు స్క్వేర్‌’లో మీరెందుకు నటించడం లేదని చాలా మంది అడుగుతున్నారు. నన్ను మరోసారి రాధికగా చూడాలనేది వాళ్ల కోరిక. అయితే సీక్వెల్‌ కథ వేరు. తొలి భాగానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అందుకే ఈ సినిమాలో నేను లేను అని క్లారిటీ ఇచ్చేసింది.

అయితే, ఆమె (Neha Shetty) నిజమే చెప్పిందా అనేది డౌట్‌గా మారింది. సినిమాలో ఉన్నరా అని అడిగితే.. అవును చెప్పి అసలు ట్విస్ట్‌ ఏ హీరోయినూ చెప్పదు. ఆ లెక్కన నేహా కూడా అబద్దం చెప్పి ఉండొచ్చు అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. అయితే అది సినిమా వచ్చినప్పడే. ఆ డేట్‌పై ఇంకా ఎక్కడా లీకులు, పుకార్లు కూడా లేవు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus