ఇటీవల జరిగిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీజర్ లాంచ్ వేడుకలో పవన్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కి ఓ బాంబు పేల్చాడు దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) . అదేంటంటే… ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత రామ్ తో హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్నాడట.’అరుణాచల క్రియేషన్స్’ బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని హరీష్ శంకర్ తెలిపాడు. ఇది రామ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అయ్యుండొచ్చు. కానీ పవన్ ఫ్యాన్స్ కి కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా మరింత ఆలస్యం అవుతుంది.
కొంతమంది అయితే ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉండదు అని కూడా అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి డెప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందువల్ల ఆయన షూటింగ్లకి డేట్స్ కేటాయించలేకపోతున్నారు. అయితే ‘ఓజీ’ (OG Movie) సినిమాని కంప్లీట్ చేస్తానని మాత్రం మాట ఇచ్చారు. మరి ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ..ల గురించి పవన్ స్పందించలేదు. అందువల్ల అభిమానుల్లో టెన్షన్ పెరిగింది.
కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని కచ్చితంగా ఫినిష్ చేస్తానని పవన్ మాటిచ్చారట. అయితే అందుకు టైం పట్టొచ్చు. అందుకే ఈలోపు హరీష్ శంకర్ ఓ సినిమా చేసుకుందామని రామ్ తో చేయికలపబోతున్నట్టు స్పష్టమవుతుంది. పవన్ ‘ఓజీ’ ‘హరి హర వీర మల్లు’ కంప్లీట్ చేసే గ్యాప్లో హరీష్ ఈ సినిమాని కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. సో పవన్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు.