Chinmayi Sripada: హగ్‌ గురించి చిన్మయి పోస్టు వైరల్.. అంతలా ఆ పోస్టులో ఏముంది?

పాటలతో మాత్రమే కాకుండా కాంట్రవర్శీలతోనూ ఎప్పుడూ ఆడియన్స్‌కి దగ్గరగా ఉండే వ్యక్తి చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) . ఈ ప్రముఖ సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌.. గత కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌, చైల్డ్‌ అబ్యూస్‌ లాంటి విషయాల్లో తన స్వరాన్ని గట్టిగానే వినిపిస్తూ వస్తున్నారు. తాజాగా చిన్మయి పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తండ్రీ కూతుళ్ల బంధాన్ని కూడా చిన్మయి తప్పుగా చూస్తోంది అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి ఆమె కూడా గట్టిగానే రిప్లై ఇచ్చారనుకోండి.

ఇంతకీ ఏమైందంటే.. కొద్ది రోజుల క్రితం తన భర్త రాహుల్ రవీంద్రన్‌ (Rahul Ravindran) హగ్ చేసుకోబోతే కుమార్తె దృప్త నో అని చెప్పిందని చిన్మయి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దృప్త నో చెప్పగానే.. ‘‘నేను నిన్ను హగ్ చేసుకోమని ఫోర్స్ చేయడం లేదమ్మా.. కానీ నాన్నకి నువ్వు అంటే ఇష్టం అది నువ్వు గుర్తుంచుకో’’ అని రాహుల్‌ తన కూతురుకు చెప్పాడని చిన్మయి ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఆ రోజు తర్వాత దృప్తను రాహుల్‌ మళ్లీ హగ్ చేసుకోవడానికి వెళ్లలేదని రాసింది చిన్మయి.

అంతేకాదు తాను కూడా ఇలానే ఉంటాను అని చిన్మయి చెప్పిది. ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరైనా సరే పర్మిషన్ లేకుండా కనీసం ఆమె బుగ్గ గిల్లను. వాళ్ల తల్లిదండ్రుల అనుమతి తీసుకునే టచ్ చేస్తాను అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు చిన్మయి. దానికి నటి సమంత కూడా స్పందించింది. రాహుల్‌ అంతే అలానే చేస్తాడు అని రాసుకొచ్చింది. దీంతో అసలు ఏం జరుగుతోంది అంటూ నెటిజన్లలో చర్చ నడుస్తోంది. అయితే తండ్రీ కూతుళ్ల బంధాన్ని చిన్మయి తప్పుగా చూడటం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు అంటున్నారు.

మరికొందరేమో ఆమె మాటలు కరెక్టే అని అంటున్నారు. దీంతో తండ్రీకూతుళ్ల బంధం పవిత్రమైనది. మీరు దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వెతుకుతున్నారు అంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. మీ మాటలు సరికాదు. పెళ్లయిన దగ్గరి నుండి మేం హ్యాపీగా ఉన్నాం. ఇక రాహుల్ గొప్ప ఆల్ఫా మేల్, మీలాంటి షిట్ కాదు అంటూ చిన్మయి ఘాటుగానే స్పందించింది. అయితే అనసూయ షోలో చిన్నపిల్లాడితో పెదాలపై ముద్దు పెట్టించుకున్న వీడియో గురించి చిన్మయి కామెంట్‌ చేసిన నేపథ్యంలోనే ఈ కామెంట్స్‌ చేసింది అని అంటున్నారు మరికొందరు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus